ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయిన భాగ్యశ్రీ ఏం చదువుకుందో తెలుసా?
06 May 2025
Basha Shek
ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ లక్కీ యెస్ట్ హీరోయిన్ అంటే బెంగాళీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సేనే అని ఠక్కున చెప్పవచ్చు
ఎందుకంటే ఈ బ్యూటీ నటించిన మొదటి తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.
నటించిన మొదటి సినిమానే ఫెయిల్ అయితే హీరోయిన్లకు మళ్లీ అవకాశాలు రావడం చాలా కష్టమనే చెప్పుకోవాలి.
అయితే భాగ్యశ్రీ విషయంలో మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది. ప్రస్తుతం ఈబ్యూటీ చేతిలో అరడజనకు పైగా సినిమాలున్నాయి.
ప్రస్తుతం ఈ క్రేజీ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి కింగ్ డమ్, అలాగే రామ్ పోతినేనితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది
వీటితో పాటు దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సూర్య తదితర స్టార్ హీరోల సినిమాల్లోనూ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇలా ఒక్క సినిమాతోనే అరడజనకు పైగా ఆఫర్లు దక్కించుకున్న భాగ్యశ్రీ ఇంతకీ ఏం చదువుకుందో తెలుసా?
మొదట నైజీరియాలోని లాగోస్ లో చదువుకుంది భాగ్యశ్రీ . ఆ తర్వాత ఇండియాకు వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..