'జై హనుమాన్'లో నటించనున్న ఆ స్టార్ హీరో:
TV9 Telugu
26 January 2024
తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' మూవీ ప్రభంజనం ఇంకా థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉంది
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మైథలాజికల్ మూవీ ఇప్పటికే రూ. 250 కోట్లు దాటేసింది.
ఇదిలా ఉంటే హనుమాన్ ప్రభంజనం కొనసాగుతుండగానే ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
జై హనుమాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి స్ట్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు ప్రకటించాడు ప్రశాంత్ వర్మ
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజునే పూజా కార్యక్రమం నిర్వహించి జై హనుమాన్ ను పట్టాలెక్కించాడు
అయితే హనుమాన్‌లో హీరో తేజ సజ్జా కాగా, జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా ఒక స్టార్ హీరో నటిస్తున్నాడట
ఇదే విషయంపై మాట్లాడిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ కోసం బాలీవుడ్ హీరోలను సంప్రదిస్తున్నామన్నాడు
దేశవ్యాప్తంగా పేరున్న ప్రముఖ నటులు జై హనుమాన్‌లో నటిస్తారని, త్వరలనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు డైరెక్టర్.
ఇక్కడ క్లిక్ చేయండి..