29 September 2023

రతిపాప ఎలిమినేట్.. అసలైన ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. 

Pic credit - Instagram

బిగ్‏బాస్ నాలుగోవారం కంటెండర్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈవారం పవరాస్త్ర సాధించుకునేందుకు సుబ్బు, ప్రశాంత్, యావర్ పోటీ పడుతున్నారు. 

అయితే మరోవైపు వీకెండ్ వచ్చేసింది. ఎలిమినేషన్ ప్రక్రియకు సమయం దగ్గరపడింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి డబుల్ ఎలిమినేషన్. 

 ఓటింగ్ పరంగా చూసుకుంటే యావర్ టాప్ లో ఉండగా.. ఈసారి హౌస్ నుంచి  బ్యూటీఫుల్ స్నేక్ రతికపాప ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే నాలుగోవారం డేంజర్ జోన్ లో రతిక, టేస్టీ తేజ ఉన్నారు. అయితే ముందుగా టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నాడని వార్తలు నెట్టింట వినిపించాయి. 

ఈసారి ఉల్టా పుల్టా సీజన్ ను రక్తికట్టిస్తూ ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటే టేస్టీ తేజతోపాటు.. రతిక కూడా ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది. 

ఇదే నిజమైంది బిగ్‏బాస్ అడియన్స్ సంతోషించడం ఖాయం. బిగ్‏బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది రతిక. కానీ ఏకంగా మనుషులతోనే గేమ్ ఆడేస్తుంది. 

నీ ఆట నువ్వు ఆడు.. మనుషులతో ఆడుకోకు అంటూ హోస్ట్ నాగార్జున పబ్లిక్ గా చెప్పినా.. మనుషులతోనే ఆడుకుంటూ ఎప్పటికప్పుడు చిరాకు తెప్పిస్తుంది. 

ముఖ్యంగా ప్రశాంత్, యావర్ ఇద్దరితోనూ ఓ ఆట అడేస్తుంది. వారిద్దరిని కవ్వించి.. ప్రేమపాఠాలు నెర్పించి చివరికి వారిద్ధరికే వెన్నుపోటు పొడిచింది.