01 October 2023
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి..
Pic credit - Instagram
శ్రీదేవి విజయ్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు అవసరం లేని పేరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత నిరీక్షణ, నిన్నే ఇష్టపడ్డాను, కాంచనగంగ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
అటు తమిళంలో వరుస చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ విషయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటి గురించి ఓ వార్త వినిపిస్తోంది.
త్వరలోనే బుల్లితెరపై స్టార్ట్ కానున్న బిగ్ బాస్ తమిళంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ఆమె సోదరి వనితా విజయ్ కుమార్ పాల్గొంది.
తమిళ్ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్. ఆమె చివరిసారిగా కన్నడలో లక్ష్మి సినిమాలో కనిపించింది శ్రీదేవి.
చాలా కాలం గ్యాప్ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రీదేవి. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ రాలేదు.
ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 7షోలో పాల్గొనున్న శ్రీదేవి.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి.