Rajeev 

బలగం బ్యూటీ మరో టాలెంట్.. ఏకంగా జిల్లా స్థాయిలో..

07 March 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్.

ఇక ఈ చిన్నది హీరోయిన్ గా మారి ఇప్పుడు దూసుకుపోతోంది. మసుదా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ .

ఆతర్వాత నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి  విజయం సాధించింది.

బలగం సినిమాలో కావ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ సక్సెస్ తర్వాత కావ్య అంతగా బిజీ కాలేకపోయింది.

తాజాగా ఈ భామ కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. తన నాగ చైతన్య అంటే ఇష్టమని తెలిపింది.

తన సెలబ్రిటీ క్రష్ నాగ చైతన్య అని చెప్పేసింది. మరి ఆయనతో సినిమా చేస్తుందేమో చూడాలి.

అలాగే తనకు ఇష్టమైన, టైమ్ బాగా స్పెండ్ చేయగలిగే ప్రదేశం బీచ్ అని తెలిపింది.

తాను జిల్లా స్థాయి వాలిబాల్ ప్లేయర్‌ని అని చెప్పిన కావ్య కళ్యాణ్ రామ్.. ఇష్టమైన ఫుడ్ అన్నం, అవకాయ అని చెప్పింది.