10 January 2024
వరలక్ష్మి చాలా రెబల్.. భిన్న కోణాల్లో కనిపించే అమ్మాయి.. ఆషికా..
TV9 Telugu
Pic credit - Instagram
అక్కినేని నాగార్జున, డైరెక్టర్ విజయ్ బిన్ని కాంబోలో రాబోతున్న సినిమా నా సామిరంగ. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది.
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. సినిమా నిరాశపరిచినా..తన నటనతో ప్రశంసుల అందుకుంది ఈ బ్యూటీ.
ఇక ఇప్పుడు నా సామిరంగ సినిమాలో వరలక్ష్మి పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కానుంది తెలిసిందే.
నాగార్జున లాంటి పెద్ద స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం చాలా అదృష్టమని.. ఇందులో వరాలు..అలియాస్ వరలక్ష్మీ అనే పాత్రలో కనిపిస్తున్నాని
ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని.. నిజానికి గ్రామీణ నేపథ్య సినిమాల్లో నాయిక పాత్రలు సున్నితంగా ఉంటాయని చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్.
కానీ ఈ సినిమాలో వరాలు మాత్రం చాలా రెబల్ అని.. ఈ పాత్ర రెండు భిన్న కోణాల్లో కనిపిస్తుందని.. సినిమా చూశాక అమ్మాయి ఇలా ఉండాలనే భావన వస్తుందట.
గ్లామర్ తోపాటు నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయడానికి ఇష్టపడతానని.. అలాగే పీరియాడిక్ సినిమా చేయాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది ఆషికా.
అలాగే తనకు రాజమౌళి సినిమాలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ మూవీలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చేయండి.