06 December 2023

వరలక్ష్మిగా మాయ చేస్తోన్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్.. 

Pic credit - Instagram

కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్. తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. 

 ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత ఆషికా నటిస్తోన్న సినిమా 'నా సామిరంగ'. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాసం చిట్టూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇందులో వరలక్ష్మి పాత్రలో కనిపించనుంది ఆషికా. ఇటీవల ఆమె పాత్రలు పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్, ఫస్ట్ లుక్ వీడియో ఆకట్టుకుంది. అందులో ఆషికా అందంగా కనిపిస్తుంది. 

పట్టు లంగావోణిలో.. బంగారు ఆభరణాలు ధరించి తెలుగింటి అమ్మాయిగా ఎంతో కనిపించింది ఆషికా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియో నెట్టింట వైరలవుతుంది. 

 గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో.. వరలక్ష్మిగా కనిపించనుంది. అద్ధంలో చూసుకుని తన అందానికి తానే మురిసిపోతున్న వరలక్ష్మిని హీరో ముచ్చటగా చూడడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 

అదే సమయంలో హీరోను చూసి వరలక్ష్మి సిగ్గుపడిపోవడం వీడియోలో చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. 

చాలాకాలం గ్యాప్ తర్వాత నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయాన్ని అందుకుంటే ఆషికాకు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం.