బాహుబలి తర్వాత సినిమాలు ఎందుకు చేయలేదో చెప్పిన అనుష్క..
07 September 2023
Pic credit - Instagram
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి నటించిన లేటేస్ట్ చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇందులో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మొదటి రోజే ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది.
అయితే పాన్ ఇండియా మూవీ బాహుబలి 2 తర్వాత అనుష్క పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఈ విషయం పై ఇటీవల అనుష్క తొలిసారి స్పందించింది.
బాహుబలి తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పానని.. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది అనుష్క శెట్టి.
ఆ సమయంలో తనకు విశ్రాంతి చాలా అవసరమని.. అందువల్లే తాను పెద్ద ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదని తెలిపింది. మరిన్ని సినిమాలు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి.
కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ వినలేదని.మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది.
ఏ భాషలలోనై మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానని... భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది అనుష్క శెట్టి.
ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాలో చెఫ్ అన్విత పాత్రలో కనిపించింది స్వీటీ. చాలా కాలం తర్వాత వెండితెరపై అనుష్క కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.