మలయాళంలోకి అనుష్క.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

TV9 Telugu

15 March 2024

టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి.

గతంలో పోల్చుకుంటే సినిమాల్లో నటించడం బాగా తగ్గించినా ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

అనుష్కా శెట్టి  చివరిగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. గతేడాది రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్‌ గా నిలిచింది.

 ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బేబమ్మ త్వరలోనే మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది.

రాజిన్‌ థామస్‌ తెరకెక్కిస్తోన్న కథనార్‌- ద వైల్డ్‌ సోర్సరర్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో కథానాయికగా ఎంపికైందీ అందాల తార.

దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మలయాళ సినిమాకుగానూ అనుష్కా శెట్టి ఏకంగా రూ.5-6 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

గతంలో ఒక సినిమాకు 3-4 కోట్లు తీసుకునే బేబమ్మ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ కావడంతో పారితోషకం పెంచిందని తెలుస్తోంది.