17 September 2023
చిరంజీవికి జోడిగా కనిపించనున్న అనుష్క.. ఏ సినిమా అంటే..
Pic credit - Instagram
చాలా కాలం తర్వాత అనుష్క నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇందులో అనుష్క, నవీన్ పోలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అయితే బాహుబలి తర్వాత సైలెంట్ అయిన అనుష్క.. ఈమూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు దేవసేనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అనుష్కకు మరో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కథానాయికగా ఛాన్స్.
మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో అనుష్కకు ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని త్వరలోనే అనుష్కతో చర్చించనున్నారట.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. సోషియో ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ నెలకొంది.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇటీవలే స్టార్ట్ అయ్యాయి. నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
త్రిష, నయన్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు అనుష్క శెట్టి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇదే నిజమైతే చిరు, అనుష్క ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి.