ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కనున్న అనుష్క! వరుడు ఎవరో తెలుసా?
28 September 2024
Basha Shek
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార అనుష్కా శెట్టి గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది అనుష్క.
ఇక ప్రభాస్ తో కలిసి నటించిన బాహుబలి మూవీతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోయిందీ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమా తర్వాత అనుష్క సినిమా కెరీర్ బాగా స్లో అయ్యింది. భాగమతి, సైజ్ జీరో లాంటి సినిమాల్లో మాత్రమే కనిపించింది.
చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే అనుష్క శెట్టి వివాహం చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.
ఓ వ్యాపారవేత్తను స్వీటి వివాహం చేసుకోవడానికి సిద్ధమైందని సమాచారం. ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని టాక్.
కాగ గతంలోనూ అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు మార్లు పుకార్లు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి..