20 December 2023

Pic credit - Instagram

'గుంటూరు కారం' సినిమాను వదలని లీకుల బెడద.. ఇప్పుడు మళ్లీ !.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం.  ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 

ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

అయితే మొదటి నుంచి ఈ సినిమాను లీకుల సమస్య వేధిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫోటోస్, వీడియోస్ లీక్ బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటివరకు లీక్ అయిన అన్ని కూడా మహేష్ పై.. లేదా సాంగ్స్ సంబంధించినవే కావడం గమనార్హం. ఇక ఇప్పుడు మరో సీన్, సాంగ్ లీక్ అయ్యింది.

తాజాగా మహేష్, శ్రీలీల డాన్స్ బిట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఇప్పుడు జరిగిన లీక్స్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. 

 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు మేకర్స్. 

ఈ సినిమాలో మహేష్ ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇటీవలే శ్రీలీల, మహేష్ కాంబోలో ఉండే ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ చేయంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అలాగే త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.