కాబోయేవాడికి ఆ ఒక్క క్వాలిటీ చాలంటున్న త్రిప్తి.. పెళ్లికి ఓకే..
TV9 Telugu
Pic credit - Instagram
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో త్రిప్తి డిమ్రి పేరు మారుమోగుతుంది. ఇందులో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి.. పెళ్లి గురించి మాట్లాడింది. అలాగే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఆసక్తికర కామెంట్స్ చేసింది త్రిప్తి.
ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఆలోచన తనకు లేదని.. ఇప్పుడు తన ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ కాబోయే భర్త అలాంటి ఉండాలట.
తనకు కాబోయే వాడికి ఆస్తి, పేరు ప్రతిష్టలు లేకపోయినా పర్లేదు.. కానీ మంచి మనసు ఉండాలని తెలిపింది. మంచిగా ఉండే డబ్బు, పేరు వచ్చేస్తాయి తెలిపింది.
దీంతో ప్రస్తుతం త్రిప్తి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. నిజానికి 2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా యానిమల్ సినిమాతో గుర్తింపు వచ్చింది.
గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో త్రిప్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు తమ ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించలేదు.
త్రిప్తికి ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. త్వరలోనే అనౌన్మెంట్ రానుంది.