'నాగ'లో నటించినందుకు అనసూయకు ఎంతిచ్చారో తెలుసా? మరీ అంత తక్కువా?

15  May 2025

Basha Shek

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తోంది.

ప్రస్తుతం పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజి బిజీగా ఉంటోంది అనసూయ

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అలాగే కొన్నిటీవీ షోస్‌ లోనూ సందడి చేస్తోంది.

 కాగా కెరీర్ ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో తళుక్కున మెరిసింది అనసూయ.

అప్పట్లో ఈ పాత్రలో కనిపించినందుకు అనసూయకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం 450 రూపాయలు మాత్రమే నట.

 'నాగ సినిమాలో ఆ సీన్‌లో కనిపించినందుకు ఆరోజు రూ.450 ఇచ్చారు. అలాగే తినడానికి ఇడ్లీ, వడ పెట్టారు' 

ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి అమ్మకి ఇచ్చేశాను. జస్ట్ ఒక్కరోజు షూటింగ్ మాత్రమే చేశాను. ఆ తరువాత మళ్లీ వెళ్లలేదు'

 'సినిమాలో నన్ను చూసి అమ్మ తిట్టింది. నాన్న చూడలేదు కాబట్టి సరిపోయింది' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది అనసూయ