TV9 Telugu

21 January 2024

మరోసారి చీరకట్టులో అదరగొట్టేసిన అనసూయ..

అనసూయ భరద్వాజ్.. న్యూస్ రీడర్‌గా పని చేసిన తరువాత జబర్దస్త్ తో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఈ అమ్మడికి సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది.

అలాగే అదే సంవత్సరం అడవి శేష్ నటించిన క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించింది.

యాంకర్ గా ఎన్నో టీవీ షోల్లో నటించి మెప్పించింది అనసూయ. ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

క్షణం, రంగస్థలం సినిమాలకు అవార్డులు అందుకుంది. ఉత్తమ సహాయక నటిగా రెండు అవార్డులు అందుకుంది అనసూయ.

రంగమర్తాండ, విమానం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది అనసూయ భరద్వాజ్.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

అంతే కాదు తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అనసూయ.