11 October 2023

కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్.. కారణం ఇదే 

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ పుట్టినరోజు నేడు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు అభిమానులు.

అక్టోబరు 11న బిగ్‌బీ పుట్టిన రోజుకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఫ్యాన్స్.

మరోవైపు కేబీసీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బీ పుట్టినరోజు వేడుకలకు షో నిర్వహకులు చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు.

ఇది తెలుసుకున్న అమితాబ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు.? అంటూ హాట్‌సీట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు.

షోలో ఎమోషనల్ అయ్యే వారికి కళ్లు తుడుచుకోడానికి నేను టిష్యూలు ఇస్తుంటాను. కానీ ఈసారి నాకు వాటి అవసరం పడింది.

కేబీసీ వేదికగా జరిగే పుట్టినరోజు వేడుకలే అత్యుత్తమమైనవి అంటూ బిగ్‌బీ ఎమోషనల్ అయ్యారు.

అక్టోబరు 11న ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి, విద్యాబాలన్, విక్కీ కౌషల్ తదితర సెలబ్రిటీలు పాల్గొంటున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌ భావోద్వేగం ఇంకెంత ఏడిపిస్తారంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ ను చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.