టాలీవుడ్‌లో ఎక్కువ ట్యాక్స్ కట్టెదెవరో తెలుసా? అన్ని కోట్లా!
07 September 2024
Basha Shek
ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 కు సంబంధించి అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారిలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు.
ఇదే సమయంలో అత్యధిక పన్ను చెల్లించిన భారతీయ టాప్-20 సెలబ్రిటీల్లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ మాత్రమే ఉండడం విశేషం.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయిన బన్నీ ఈ ఏడాది సుమారు రూ. 14 కోట్ల పన్ను చెల్లించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం.
సినిమాల పరంగా చూస్తే పుష్ప సినిమాతో నార్త్ లో కూడా తనదైన స్థాయిలో ముద్ర వేసుకున్నారు అల్లు అర్జున్.
ప్రస్తుతం సూపర్ హిట్ ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 షూటింగులో బిజీగా ఉన్నాడు బన్నీ.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదలకి సిద్ధం అవుతోంది.
ఇందులో అల్లు అర్జున్ సరసన కన్నడ క్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..