అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్.. ఆ స్టార్ హీరోయినే రెచ్చగొట్టిందా?

03 May 2025

Basha Shek

బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన సిక్స్ ప్యాక్‌ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

2007లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి మెస్మరైజ్ చేశాడు.

 అయితే అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్  చేయడానికి ఓ స్టార్ హీరోయిన్ కారణమట. ఈ విషయాన్ని బన్నీ ఇటీవలే వేవ్స్ సదస్సులో బయట పెట్టాడు.

అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా లో  హీరోయన్ గా నటించిన ఆమె టాలీవుడ్ హీరోలను చాలా చూలకన చేసి మాట్లాడిందట.

'టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు.  బాలీవుడ్ హీరోల మాదిరి బాడీ బిల్డ్  చేయలేరు' అని కామెంట్స్  చేసిందట.

దీంతో  పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టి.. దేశముదురు సినిమా టైమ్ కు  సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు అల్లు అర్జున్

ఎవరైనా మన వల్ల ఆ పని కాదు అంటే.. అది చేసి చూపించడంలో వచ్చే కిక్కే వేరుంటది అంటాడు అల్లు అర్జున్.

అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ చేసి సదరు హీరోయిన్ నోరు మూయించాడు బన్నీ. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు ఐకాన్ స్టార్.