బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 రిలీజ్ వాయిదా! కారణమిదే
TV9 Telugu
12 June 2024
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నాడు.
కాగా పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల చేయనున్నారు.
పుష్ప 2 సినిమా రిలీజ్ కు సంబంధించి ఇప్పటికే చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
అయితే ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ నాటికి అల్లు అర్జున్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని తెలుస్తోంది.
షూటింగ్ పూర్తి కావడానికి ఇంకో నెల సమయం పడుతుందని. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు సమాచారం
దీనికి తోడు పుష్ప 2 వీఎఫ్ఎక్స్ పై డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తితో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది.
ఎడిటింగ్ పనుల్లోనూ జాప్యం జరుగుతోందని, అందుకే ఆగస్టు 15 నాటికి పుష్ప రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి..