అల్లు అర్జున్ ఆఫీస్‌లో ఆ డైరెక్టర్ ఫొటో.. త్రివిక్రమ్, సుకుమార్ ఇద్దరూ కాదు..
18 November2024
Basha Shek
నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్‌స్టాపబుల్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇప్పుడు నాలుగో సీజన్ లోనూ మూడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.
ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అల్లు అర్జున్.
అలాగే తన సినిమా కెరీర్ కు దోహదం చేసిన సినీ ప్రముఖులు, డైరెక్టర్లతో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఈ సందర్భంగా తనకు గంగోత్రి లాంటి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్రరావు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బన్నీ
'నా ఆఫీస్ లోకి ఎవరైనా వస్తే ఫస్ట్ కనపడేది రాఘవేంద్రరావు గారి ఫోటోనే. దాని కింద నా ఫస్ట్ డైరెక్టర్ అని రాసి ఉంటుంది'.
' నా మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నప్పుడు నేను డ్యాన్సులు వేస్తుంటే ఆయనే నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చారు'
'ఆ తర్వాత రాఘవేంద్ర రావుగారే నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి నన్ను హీరోని చేశారు' అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్
ఇక్కడ క్లిక్ చేయండి..