రష్మికాకు ఆ నెల ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే

14 August 2023

Pic Credit - Instagram

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తుంది రష్మిక మందన్న. ఛలో సినిమాతో పరిచయమైన ఈబ్యూటీ వరుసగా సినిమాలు చేస్తుంది

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విషయం సాధించిన విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ వయ్యారి.

రష్మిక మందన్నకు సెంటిమెంట్ ఉందట. రష్మిక మందన్నకు డిసెంబర్ నెల బాగా కలిసొస్తుందంటున్నారు విశ్లేషకులు.

రష్మిక తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్ 31న విడుదలై కన్నడలో సూపర్ హిట్ సాధించింది. రెండో సినిమాకూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ తొలి పార్టు డిసెంబర్‌‌ 17న విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది.

అమితాబ్‌ బచ్చన్ తో కలిసి నటించిన తొలి హిందీ చిత్రం గుడ్‌నైట్ కూడా డిసెంబర్‌‌లో విడుదలై  ఈ అమ్మడికి పేరు తెచ్చింది.

రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్‌’ లో నటిస్తుంది. రష్మిక సాందీపు రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌‌ 1న విడుదల కానుంది.