బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. స్టూడెంట్ ఆఫ్ దియర్ సినిమాతో సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది అలియా.
ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ఇక ఇటీవలే గంగూబాయి కతియవాడి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది అలియా.
ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ఇక ఇటీవలే గంగూబాయి కతియవాడి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది అలియా.
ఇక ఇటీవలే తల్లై మాతృత్వపు మాధుర్యాన్ని కూడా ఆస్వాదిస్తోంది. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాలో నటించింది అలియా.
ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా అలియా శారీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రమోషన్లలో అలియా చీరకట్టులో హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలియా.. గంగూబాయి కతియావాడి చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుని తనను తాను నిరూపించుకుంది.
ఇటీవలే హార్ట్ స్టోన్ అనే ఓ హాలీవుడ్ సినిమాతోనూ అభిమానులను పలకరించింది అలియా. ఇందులో ఆమె నెగిటివ్ పాత్రలో నటనకు మంచి మార్కులే పడ్డాయి.