ఎప్పటికైనా ఆ టాలీవుడ్ హీరోతో యాక్ట్ చేయడం నా డ్రీమ్: ఐశ్వర్యా రాజేష్

26 January 2025

Basha Shek

తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే ఇందుకు కారణం.

 విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఐశ్వర్య రాజేశ్ ‘భాగ్యం’ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది

ఈ సినిమాలో నలుగురు పిల్లల తల్లిగా ఐశ్వర్య రాజేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. .

 గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమానే ఐశ్వర్యకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  

ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

స్టూడెంట్ నెం. 1 సినిమా నుంచి ఎన్టీఆర్ ను చూస్తున్నాను. ఆయన డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.'

తారక్ తో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. ఆ ఛాన్స్ ఇప్పటివరకు రాలేదని.. భవిష్యత్తులో వస్తే కచ్చితంగా చేస్తాను’ అని చెప్పింది ఐశ్వర్య.