ఐశ్వర్యా రాజేషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
17 February 2025
Basha Shek
ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఐశ్వర్యా రాజేష్.
ఇందులో వెంకటేష్ భార్యగా ఆమె పోషించిన భాగ్యం పాత్ర అందరి మన్ననలు అందుకుంటోంది.
అలాగే తన మాటలు, నటనతో ప్రతి ఒక్కరితో తెలుగు ఆడియెన్స్ తో శభాష్ అనిపించుకుంది ఐశ్వర్య రాజేష్.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది ఐశ్వర్య
ఈ సందర్భంగా తనకు ఇష్టమైన నటీనటుల గురిచి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అందాల తార.
'నా దృష్టిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎన్టీఆర్. నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని.ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డ్యాన్సుల్లో స్పెషాలిటీ ఉంటుంది'
'ఇక నటీమణుల్లో బాలీవుడ్ తార అలియా భట్ నటన బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది ఐశ్వర్యా రాజేష్.
కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక్కడ క్లిక్ చేయండి..