జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

14 January 2025

Basha Shek

రాజకీయాల్లోకి సినిమా తారలు రావడం కొత్తేమీ కాదు. గతంలో నటులు ఎన్టీఆర్, జయలలిత సీఎంల స్థాయికి ఎదిగారు.

ఇప్పుడు వీరి స్ఫూర్తితోనే మరికొందరు అందాల తార రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. ఇటీవల త్రిష కూడా ఇదే చెప్పింది.

తాజగా మరో ప్రముఖ హీరోయిన్ పాలిటిక్స్ లోకి వస్తానంటోంది. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్.

తెలుగులో గతేడాది హనుమాన్‌ సినిమాతో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఈసారి మదగజరాజా సినిమాతో మన ముందుకు వచ్చింది

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన వరలక్ష్మి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

‘ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా  అన్న ప్రశ్నకు బదులిస్తూ  కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేసిందీ ముద్దుగుమ్మ.

అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నది వరలక్ష్మి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు స్ఫూర్తి అని తెలిపిందీ బ్యూటీ.

ప్రస్తుతం వరలక్ష్మి వ్యాఖ్యలు తమిళ సినిమా ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా మారాయి.  ఇటీవల విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.