04 October 2023
డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటోన్న వరలక్ష్మి శరత్ కుమార్..
Pic credit - Instagram
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. దీనికి ఓంకార్ దర్శకత్వం వహించగా.. అవికా గోర్ కీలకపాత్ర పోషించింది.
ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసు గురించి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటివరకు తనకు ఎలాంటి సమన్లు లేదా ఫోన్ కాల్స్ రాలేదని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
గతంలో ఆదిలింగం అనే వ్యక్తి తన వద్ద ఫ్రీలాన్స్ మేనేజర్‌గా వర్క్ చేశారని.. సర్కార్ తోపాటు ఆయన తీసుకువచ్చిన మూడు సినిమాల్లో నటించిందట.
అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తనకు ఏమీ తెలియదని. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆయన పేరుతో వార్తలు వచ్చాయని అన్నారు.
అందుకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో తన ఫోటోను, పేరును ఉపయోగించి వరలక్ష్మి శరత్ కుమార్ మేనేజర్‌కు నోటీసులు అని వార్తలు వేస్తున్నారని తెలిపింది.
అంతేకానీ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. పదేళ్లలో దాదాపు 50 సినిమాలు చేయడం అంటే ఎంతో కష్టపడి ఇక్కడివరకు వచ్చానని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.