దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతోంది హీరోయిన్ త్రిష. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ క్రేజే వేరు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది త్రిష. ఇందుకు కారణం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమానే అని చెప్పొచ్చు.
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసిన త్రిష... వరుసగా భారీ చిత్రాల ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే లియో మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది.
ఈ మూవీ తర్వాత మిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న విడతలి చిత్రంలోనూ త్రిష కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అలాగే ధనుష్ దర్శకత్వం వహించిన డి50లో త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీలో త్రిష మళ్లీ అగ్రకథానాయికగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన నటించిన త్రిష.. లియో సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఎక్కువే.
లియో చిత్రానికి దాదాపు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ రావడంతో తన పారితోషికాన్ని పెంచేసిందట.
ప్రస్తుతం ఆమె నటిస్తోన్న విడతల, డి50, కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రాలకు గానూ త్రిష దాదాపు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.