05 October 2023
20 ఏళ్లుగా వెండితెర యువరాణి.. మరింత అందంగా త్రిష..
Pic credit - Instagram
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చేసింది హీరోయిన్ త్రిష. ఇప్పుడు ఆమె విజయ్ దళపతి జోడిగా లియో చిత్రంలో నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తోంది త్రిష.
దాదాపు 20 ఏళ్లుగా కథానాయికగా వెండితెరపై అలరిస్తోంది ఈ బ్యూటీ. చాలా కాలంపాటు ఈ బ్యూటీ నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకులేదు.
కానీ ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి త్రిషకు క్రేజ్ వచ్చేసింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
లియో సినిమాతోపాటు ది రోడ్ చిత్రంలోనూ నటిస్తోంది త్రిష. ఈ రెండు సినిమాలో త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి
ఈ రెండు సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లోని అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఈ బ్యూటీ మరింత ఫేమస్ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ ప్రమోషన్లలో తన లేటేస్ట్ లుక్స్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపిస్తుంది త్రిష.
ఇక్కడ క్లిక్ చేయండి.