29 December 2023

Pic credit - Instagram

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన త్రిష.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ.. 

TV9 Telugu

పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‏లో హిట్ అందుకుంది త్రిష. ఈ మూవీ ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. 

 కథానాయికగా రెండు దశాబ్దాల కెరియర్ పూర్తిచేసుకుంది త్రిష. ఇప్పుడు చేతినిండా సినిమాలతోపాటు.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తమిళంలో అజిత్ జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్ థగ్స్ లైఫ్ సినిమాలోనూ నటించే ఛాన్స్ అందుకుంది ఈ అందాల తార. 

ఇవే కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర సినిమాలో త్రిషనే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక ఇప్పుడు హిందీలో నటించే అవకాశం సొంతం చేసుకుంది త్రిష. 2010లో హిందీలో అక్షయ్ కుమార్ జోడిగా కట్టా మీటా సినిమాలో నటించింది త్రిష. 

 ఆ తర్వాత మళ్లీ నటించలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత అక్కడ మరో  క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా సల్మాన్ జోడిగా అంట.

తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ది బుల్ అనే మూవీ చేస్తున్నారు. ఇందులో త్రిషను కథానాయికగా ఎంపిక చేసినట్లుగా టాక్. 

మాల్దీవుల తిరుగుబాటును ఆపడానికి 1988 ఆపరేషన్ కాక్టస్ నిర్వహించిన బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా నేతృత్వంలోని భారత పారాట్రూపర్స్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.