సౌత్ ఇండస్ట్రీలో క్వీన్‌గా దూసుకుపోతుంది త్రిష. నాలుగు పదుల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తూ.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్.
ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది త్రిష. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ హీరో అజిత్ సరసన విడతల సినిమాలో నటిస్తుంది.
ఇప్పుడు త్రిష సినీ పరిశ్రమలో కథానాయికగా 21 సంవత్సరాల పూర్తిచేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో త్రిషకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రజినీ, కమల్, విజయ్ దళపతి, అజిత్, ధనుష్ ఇలా సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.
చాలా కాలం గ్యాప్ ఇచ్చిన త్రిష.. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో కుందవై యువరాణిగా మనసులు దోచుకుంది.
సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాలు మాత్రమే హీరోయిన్స్ అలరిస్తారు. ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తుంటారు. కానీ త్రిష వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ 21 ఏళ్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
2002లో సూర్య హీరోగా నటించిన మౌనం పాసియేట్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది త్రిష. ఇప్పుడు ఆ సినిమా విడుదలై 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
దీంతో తమిళ్ సినిమా పరిశ్రమలో 21 ఏళ్లుగా కథానాయికగా నటిస్తోన్న ఘనత కేవలం త్రిష సొంతం. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బిజీగానే ఉంది.