పెళ్లి విషయంలో శ్రుతి హాసన్ సంచలన నిర్ణయం!
TV9 Telugu
05 July 2024
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ కూడా ఒకరు.
సమయం కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహించడం శ్రుతీహాసన్‌కు అలవాటు.
అలా ఇటీవల మరోసారి ఈ బ్యూటీ చాట్ సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్. నెటిజన్లతో సరదాగా ముచ్చట్లు పెట్టింది.
ఇందులో భాగంగా... ‘మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగితే శ్రుతీహాసన్ కాస్త గట్టిగానే బదులిచ్చింది
'ఇది 2024... అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది శ్రుతి హాసన్.
అలాగే ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్’ అని మరో నెటిజన్ శ్రుతిని అడిగాడు. దీనికి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యిందీ అందాల తార.
'ఐ వోన్ట్ సార్’ (చేసుకోను సార్) అని సమాధానం ఇచ్చింది శ్రుతి. అంటే.. అసలు పెళ్లే చేసుకోనని సూటిగా చెప్పేసిందన్న మాట.
అయితే నెటిజన్లు తరచూ ఈ ప్రశ్నలు అడుగుతుండడం వల్ల చిరాకులో శ్రుతి ఇలా చెప్పేసిందంటున్నారు ఆమె అభిమానులు.
ఇక్కడ క్లిక్ చేయండి..