ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా గడిపాను.. పెళ్లిపై రకుల్ కామెంట్స్..
TV9 Telugu
Pic credit - Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్లో సెటిల్ అయ్యింది రకుల్.
కొన్నాళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలో జరగనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది. ప్రతి ఒక్కరూ భాగస్వామిని కలిగి ఉండడం సహజమైన ప్రక్రియ అని.. నటీనటుపై రూమర్స్ వస్తుంటాయని తెలిపింది.
తాను ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా జీవించానని.. జాకీ తన జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయిందని.. ఒకే పరిశ్రమ కావడంతో తను అర్థం చేసుకున్నాడట.
ఇద్దరూ సినిమా, ఫిట్ నెస్ ను ఇష్టపడతామని.. రోజుకు 12 గంటలు షూటింగ్లోనే బిజీగా ఉంటామని.. గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతామని తెలిపింది.
ఆ సమయంలో వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటామని అన్నారు రకుల్. అలాగే తాను పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది రకుల్.
సినీ నేపథ్యంలో లేకపోవడం వల్ల మొదట్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదని.. ఫస్ట్ సినిమాతోనే ఆదరణ లభించడం అదృష్టమని తెలిపింది రకుల్ ప్రీత్.
ఎక్కువగా కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో నటించానని.. స్క్రిప్ట్ నచ్చితే ఎక్కువ గంటలు పనిచేశానని.. పారితోషికం గురించి ఆలోచించలేదని తెలిపింది రకుల్.