ఆ స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్ లయ..
02 September 2023
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫ్యామీలీ హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ లయ.
లయ చెస్ ఛాంపియన్.. అంతేకాదు సంగీతం, నృత్యంలోనూ తన ప్రతిభను కనబరిచి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది హీరోయిన్ లయ.
లయ చెస్ ఛాంపియన్.. అంతేకాదు సంగీతం, నృత్యంలోనూ తన ప్రతిభను కనబరిచి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది హీరోయిన్ లయ.
ఆ తర్వాత ప్రేమించు సినిమాతో మరో హిట్ అందుకుంది. మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది లయ.
సినిమాలు చేస్తూనే పెళ్లి చేసుకున్న లయ.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. చివరిసారిగా 2018లో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించింది.
ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది లయ. ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నితిన్ అక్కగా కనిపించనున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా గురించి హీరోయిన్ లయతో చర్చలు జరిగాయని.. ఇందులో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్లో టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి.