22 September 2023

ఉప్పెన బ్యూటీ చేతిలో ఒక్క సినిమానే.. ఇలాగైతే కష్టమే బేబమ్మ.. 

Pic credit - Instagram

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది కృతి శెట్టి. ఈ మూవీ విడుదలకు ముందు బేబమ్మకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. 

ఈ మూవీ తర్వాత వరుసగా రెండు హిట్స్ అందుకున్న కృతి.. ఆ తర్వాత మాత్రం సరైన విజయాన్ని అందుకోలేక డీలా పడింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులోనూ మరో చిత్రంలో నటిస్తుంది. 

 తాజాగా కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా ఎలాంటి జోష్ కనిపించలేదు. బేబమ్మ బర్త్ డేకు కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే అనౌన్స్ చేశారు. 

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సరసన కృతి శెట్టి నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సెప్టెంబర్ 21న అధికారికంగా ప్రకటించారు. 

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సరసన కృతి శెట్టి నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సెప్టెంబర్ 21న అధికారికంగా ప్రకటించారు. 

ఇప్పటివరకు శర్వానంద్, కృతి కాంబోలో సినిమా రాలేదు. వీరిద్దరు కలిసి నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. 

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అంతేకాదు.. టైటిల్ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంది.