ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తో పెళ్లి రూమర్లు.. అసలు విషయం చెప్పేసిన అనుష్క
10 November2024
Basha Shek
నాలుగు పదుల వయసు దాటినా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్లలో అందాల తార అనుష్కా శెట్టి పేరు ముందు ఉంటుంది.
బాహుబలి 2 తర్వాత అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోందీ అందాల తార. అవి కూడా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే.
ప్రస్తుతం చిన్న గ్యాప్ తరువాత క్రిష్ జాగర్ల మూడీ దర్శకత్వంలో ఘాడీ అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది అనుష్క
దీంతో పాటు మరో రెండు సినిమాల్లోనూ స్వీటీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే ఇప్పుడు వేగంగా సినిమాలు చేస్తోందీ అందాల తార.
ఇలా సినిమాల సంగతి పక్కన పెడితే.. పెళ్లి విషయంలో తరచూ నటి అనుష్కపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.
ఈ మధ్యన ఒక వ్యాపార వేత్తతో, అలాగే ఒక టాలీవుడ్ డైరెక్టర్ తో స్వీటీ వివాహం జరగనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది.
తాజాగా వీటిపై స్పందించిన అనుష్క వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదన్నారు.
పెళ్లి అనేది ఏమంత నేరం కాదని, భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం మానుకోవాలని హితవు పలికారు.
ఇక్కడ క్లిక్ చేయండి..