ఆ నిర్మాత అలా అన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి అను ఇమ్మాన్యుయేల్‌

29 August 2023

Pic Credit - Instagram

నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేసింది అను ఇమ్మాన్యుయేల్‌

తెలుగులో పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి ,  అల్లు అర్జున్ తో నాపేరు సూర్య ఆతర్వాత విజయ్ దేవరకొండ , రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసింది.

అందం అభినయం ఉన్నాకూడా ఈ భామ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తుంది .

రీసెంట్ గా అల్లు శిరీష్ సరసన ఊర్వశివో రాక్షసివో చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. దీంతో తాజాగా రవితేజ రావణాసురలో ఓ హీరోయిన్‌గా కనిపించింది.

ప్రస్తుతం తమిళ్ లో కార్తీ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా పైనే అను ఆశలు పెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది

అను ఇమ్మాన్యుయేల్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని తెలిపింది. తనకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోచింది.

కెరీర్ బిగినింగ్ లో ఓ నిర్మాత వచ్చి ఓ సినిమా ఆఫర్ ఇస్తాను.. కాస్తా అడ్జెస్ట్ అవ్వాలని అడిగాడట. దాంతో షాక్ అయ్యాను. వెంటనే నో చెప్పేసాను అని తెలిపింది.