16 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అంజలి.. అసలేమైందంటే?

TV9 Telugu

08 July 2024

ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది మన తెలుగమ్మాయి అంజలి.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస సినిమాలతో దూసుకెళుతోన్న అంజలి ఓ అరుదైన మైలురాయికి చేరువైంది.

అదేంటంటే..సినిమా కెరీర్‌ పరంగా అంజలి అర్ధ సెంచరీని దాటేసింది. ఇప్పుడు ఆమె నటిస్తోన్న 50వ చిత్రం ఈగై.

ప్రస్తుతం ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నటి అంజలి కూడా ఈ షూట్ లో పాల్గొంటోంది.

కాగా ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకేసిందట. అది కూడా ఎలాంటి డూప్ లేకుండా.

ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

కాగా శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్‌చేంజర్‌ చిత్రంలో అంజలి ముఖ్యపాత్రను పోషిస్తోంది.

ఇటీవల విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అంజలి కనిపించింది. త్వరలో ఆమె నటించిన బహిష్కరణ సిరీస్ రిలీజ్ కానుంది.