నాని ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ?.. ఇప్పుడు మాత్రం తనే అంటోన్న హీరో..

23 September 2023

Pic credit - Instagram

న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే దసరా సినిమాతో సూపర్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హాయ్ నాన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇందులో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. గతంలో జెర్సీ సినిమాలో తండ్రి పాత్రల నటించి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 

 ఇప్పుడు మరోసారి తన నటనతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. 

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రేడియో జాకీలతో కలిసి చిట్ చాట్ నిర్వహించారు నాని. ఈ క్రమంలోనే తన ఫస్ట్ క్రష్ ఎవరో బయటకు చెప్పేశారు. 

తాను మూడో తరగతిలోనే ప్రేమలో పడిపోయానని.. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చిందని అన్నారు. 

తనేమో ఆకులు చుట్టుకుని నిలబడ్డానని.. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే మంచి డ్రెస్ వేసుకున్న కాబట్టి వెళ్లి తనను పలకరిస్తానని అన్నాడు నాని. 

అలాగే ప్రస్తుతం తన క్రష్.. కియారా ఖన్నా అని తెలిపారు. కియారా ఖన్నా.. ఇప్పుడు నాని హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోన్న చైల్డ్ ఆర్టిస్ట్

కియారా ఖన్నా చక్కగా రెడీ అయి సెట్ కు వచ్చిందని.. భలే ముచ్చటగా అనిపించిదని.. తన వయసులో ఉంటే తనపై మసను పారేసుకునేవాడిని అన్నారు.