ప్రభాస్ కల్కి ట్రైలర్ లో ఈ 5 విషయాలు గమనించారా?హైలెట్ అదే..

TV9 Telugu

11 June 2024

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 సినిమా.. ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే కల్కి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  అయితే  ఇందులో కొన్ని అంశాలు హైలెట్ గా నిలిచాయి.

పికా పడుకొనే పాత్రని గర్భవతిగా చూపించడం దాని బట్టి ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక సినిమాలో దీపికా,  అశ్వద్ధామ పాత్రలను చూస్తుంటే కల్కికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని అర్థమవుతోంది.

కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, శోభన తదితర  స్టార్ నటీనటులు సినిమాలో  కనిపించారు.

అయితే ఇవన్నీ జస్ట్ క్యామియో రోల్సేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  ఈ పాత్రలు జస్ట్ అలా వచ్చిపోతాయని ఊహించుకుంటున్నారు.

ఇక ట్రైలర్ లో కమల్ హాసన్ హైలెట్ గా నిలిచారు. మొదటిసారి చూసినప్పుడు ఆయనను అసలు గుర్తు పట్టలేకపోయారు.

కల్కి సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కమల్ హాసన్ కనిపించనున్నారు. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.