ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు .

గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

పేపర్ బాయ్ తో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు.

సినిమాల్లో బిజీగా ఉంటూనే ఓటీటీ లో ప్రాజెక్ట్స్ చేస్తూ మరో సెక్షన్ ఆడియెన్స్ నూ మెప్పిస్తున్నారు.

ఈ హీరో నటించిన కొత్త సినిమా “లైక్ షేర్ సబ్ స్క్రైబ్”నవంబర్ 4న రిలీజ్ కానుంది, "అన్ని మంచి శకునములే” అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నారు

చేతినిండా అవకాశాలతో , వరుస సినిమాలతో , బిజీగా బిజీగా మారాడు ఈ యంగ్ హీరో సంతోష్ శోభన్.