టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఒకరు
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుతున్నాడు శర్వా..
మొదటి నుంచి శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
గత కొంత కాలంగా శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి.
శర్వా సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది.. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా..
ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా..
ఈ క్రమంలోనే ఒకే ఒక్క జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇది అయినా శర్వా ని నిలబెతుంది ఏమో చూడాలి..