సీనియర్ ఎన్‌టీఆర్ కుల గౌరవం, దాన వీర శూరకర్ణ, శ్రీ కృష్ణ సత్య, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర లాంటి సినిమాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలలో రామారావు నటించి అలరించారు.

              ఏఎన్‌ఆర్ అక్కినేని నాగేశ్వర రావు నవరాత్రి అనే సినిమాలో 9 పాత్రలు చేయడం విశేషం. అది కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు.

            సూపర్ స్టార్ కృష్ణ కుమార రాజా, రక్తసంబంధం, పగబట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, బొబ్బిలి దొర లాంటి 7 సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ  త్రిపాత్రాభినయం చేసి అలరించారు.

            శోభన్ బాబు శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు.

            మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు పాత్రలలో నటించారు.

             బాలకృష్ణ అధినాయకుడు అనే చిత్రంలో నందమూరి బాలకృష్ణ  త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో తాతగా, తండ్రిగా, మనవడిగా నటించి అలరించారు.

           జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు.

             కళ్యాణ్ రామ్ ఇటీవలే వచ్చిన అమిగోస్ అనే సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్  త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించి ఆకట్టుకున్నాడు.