ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దేశముదురు చిత్రం ఒకటి.
ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది డైనమిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్.
కాగా.. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన బద్దలు కొట్టి వసూలను రాబట్టిన ఏకైక చిత్రంగా దేశముదురు నిలిచింది.
ఇక ఈ చిత్రం కోసం చక్రి అందించిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ బంపర్ హిట్ గా నిలిచాయి.
ఇక అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ తో నటించిన ఈ చిత్రంతో అప్పట్లో ఎందరినో ఆకట్టుకున్నాడు.
ఫస్ట్ సినిమా పూరి జగన్నాథ్ అనుకున్నది దేశముదురు చిత్రం అల్లు అర్జున్ తో కాదట.. మరెవరితో అనుకుంటున్నారో తెలుసా?
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ యార్లగడ్డతో.
అప్పట్లోనే సుమంత్ హీరోగా మంచి ప్రయత్నాలు చేస్తూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి..
దాంతో అదే సమయంలో పూరి జగన్నాథ్ సుమంత్ వద్దకు వెళ్లి దేశముదురు స్టోరీని లైవ్ లో వినిపించసాగాడు.
ఇక హీరో సన్యాసిని ప్రేమిస్తాడు.. అంటూ తన స్టోరీని మొదలు పెట్టగానే సుమంత్ కి ఈ స్టోరీ అంతగా మాత్రం ఆకట్టుకోలేక పోయిందట.
స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ సంప్రదించాడంట. ఇక ఆయన వెంటనే ఓకే చెప్పేసాడు.