సీనియర్‌ సినీనటి జమున (86) కన్నుమూశారు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి పలు భాషాల్లో కొన్ని వందల చిత్రాల్లో నటించిన జమున

గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో చదువుకున్న జమున అసలు పేరు జానాభాయి

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారావు, కృష్ణ, జగ్గయ్య, కాంతారావు వంటి సీనియర్ నటులతో నటించారు

నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు

1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు