నాని: దసరా సినిమాలో నాని తెలంగాణ భాషలో అదరగొట్టాడు
వెంకటేష్: పోకిరి రాజా సినిమాలో వెంకటేష్ డబుల్ రోల్ చేశారు. అందులో ఓ పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసలో మాట్లాడి అలరించారు.
నాగార్జున: కింగ్ సినిమాలో బొట్టు శీను పాత్రలో తెలంగాణ యాసలో మాట్లాడి నాగ్ మెప్పించారు.
పవన్ కళ్యాణ్: జల్సా, ఖుషి, భీమ్లా నాయక్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ అక్కడక్కడ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించారు
మహేష్ బాబు: దూకుడు సినిమాలో ఎంఎల్ఏ గా కనిపించినా కాసేపు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మహేష్ మెప్పించారు.
జూనియర్ ఎన్టీఆర్: బాద్ షా సినిమాలో కూడా రామారావు పాత్ర కోసం ఎన్టీఆర్ తో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడించాడు దర్శకుడు శ్రీనువైట్ల.
విజయ్ దేవరకొండ: పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు
వరుణ్ తేజ్: ఎఫ్2, గద్దల కొండ గణేష్, ఎఫ్3 వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించాడు ఈ మెగా హీరో.
అల్లు అర్జున్: రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి క్లాప్స్ కొట్టించాడు.
రామ్: జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.