గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి పైగా సినిమాలతో జోరు చూపించేవారు. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు వీరే.
కృష్ణ: 1972లో ఏకంగా కృష్ణ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు.
నందమూరి తారక రామారావు: 1964 లో ఈయన నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి.
కృష్ణంరాజు: 1974లో 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కృష్ణంరాజు.
రాజేంద్రప్రసాద్: 1988లో మొత్తం 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి:1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు
జగపతిబాబు: జగపతిబాబు కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో ఒక సంవత్సరంలోనే ఆరు సినిమాలను విడుదల చేశారు.
బాలకృష్ణ: 1987వ సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.