రీసెంట్ డేస్ లో లవ్, బ్రేకప్.. పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయి.ఈ విషయంలో శ్రుతిహాసన్ కూడా ఉన్నారు.
గబ్బర్ సింగ్ సినిమాతో హీరోయిన్ గా హిట్ అందుకుంది. ఇక ఈ అమ్మడు ఇప్పటికే పలుసార్లు లవ్ లో పడింది.
అప్పుడెప్పుడో స్కూల్ డేస్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను అని తెలిపింది శ్రుతి. ఇక కెరీర్ స్టార్టింగ్ లో హీరో సిద్దార్థ్ తో ప్రేమలో పడిందని వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
ఆ తర్వాత లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడింది. అతడితో చట్టపట్టాలేసుకు తిరిగింది. అంతే కాదు. అతడిని తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.
ఆ తరవాత అతడితో తెగదెంపులు చేసుకుంది. సడన్ గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక కొంతకాలానికి మరోసారి ప్రేమలో పడింది శ్రుతి హాసన్.
ఈసారి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించింది. కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి ఉంటున్నారు.
తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేసింది శ్రుతి.
ఇక ఇప్పుడు ఇతగాడితో కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ చూస్తే అది అర్ధమవుతోంది.