ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట
రెండవ జంట గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం.. తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు
బోళాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలాంటి జంటను గౌరీశంకరుల జంట అని అంటారు
ఏ మాట మాట్లాడినా.. ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట
ఏ ఇంట అతని భార్య నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంటని అంటారు
ఏ జంట భర్త మెత్తగా ఉండి.. అందరికీ నచ్చే మెచ్చే వాడిగా ఆకర్షణీయుడై ఉండి భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంటను రోహిణీ చంద్రుల జంటగా పోలుస్తారు