ఆచార్య చాణక్యుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి
తన అనుభవాల ఆధారంగా మనిషి జీవించే విధానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు
ఓ వ్యక్తి జీవితంలో విజయం సొంతం చేసుకోవాలన్నా.. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా మారాలో కూడా సూచించాడు
ఈరోజు ఆ సూత్రాలు ఏమిటో చూద్దాం
ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు.. వ్యక్తి తన ఆలోచనలను స్థిరంగా,సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి
ఏదైనా పనిని ప్రారంభించబోయే సమయంలో అది మీరు చేయగలరా లేదా అని ఆలోచించాలి
అంతేకాదు.. ఒకవేళ ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే.. మరొక ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని అప్పుడే విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పాడు
కొత్త పనిని ప్రారంభించేటప్పుడు.. ఆ వ్యాపారవేత్త తన ప్రసంగంపై నియంత్రణ కలిగి ఉండాలని చాణక్యుడు సూచించాడు