వెల్లుల్లి ఆహారానికి రుచిని జోడించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో అనేక రకాల ఆరోగ్య సమస్యల నివారణకు కూడా సహాయా పడుతుంది

దగ్గు ,జలుబు నుండి వాపు ,అధిక రక్తపోటు వరకు అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది.

 తేనె ,వెల్లుల్లి కలిసి జీవక్రియను పెంచి, అధిక బరువును తగ్గించడంలో  సహాయ పడుతుంది

వెల్లుల్లి లో B6 ,C, ఫైబర్, మాంగనీస్, కాల్షియంతో నిండి ఉంది. ఇది మీ బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎనిమిది వారాల పాటు వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది

ఒక చిన్న కప్పులో ఒక టీస్పూన్ తేనె తీసుకుని అందులో వెల్లుల్లి కలపాలి. ఈ రెండు పదార్థాలను సరిగ్గా కలపండి.15-20 నిమిషాలు నానబెట్టండి. ఇది ఉదయం మాత్రమే తినాలి.

3 రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవడం మంచిది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

 మీరు గర్భవతిగా ఉంటే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే..  తేనె , వెల్లుల్లిని కలిపి తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.